ఈరన్న స్వామి రాజగోపాల నిర్మాణం కోసం లక్ష రూపాయలు విరాళం

కర్నూలు: కౌతాళం ఉరుకుందలో వెలసిన ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థాన రాజగోపురం నిర్మాణం కోసం విరాళం. ఆదోని చెందిన లేట్ కాసా వీరప్రసాద్ వారి జ్ఞాపకార్ధంగా జి. రాధ రూ.1, 00,000 గురువారం విరాళంగా అందజేశారు. దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు.