స్విమ్స్ కార్మికుల దీక్షలకు CITU మద్దతు
TPT: ఏర్పేడు అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ మండల కన్వీనర్ రాంబాబు ఆధ్వర్యంలో రైతు సంఘం, కేవీపీఎస్, పారిశుద్ధ్య కార్మికులు శనివారం నిరసన చేపట్టారు. తిరుపతి స్విమ్స్ కార్మికుల శానిటేషన్ హోదాను తొలగించి, వార్డ్ బాయ్ హోదాగా మార్చాలని డిమాండ్ చేస్తూ గత 23 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు వీరు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.