VIDEO: పిల్లలమర్రి శివాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు

VIDEO: పిల్లలమర్రి శివాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు, రుద్రాభిషేకలు ఘనంగా నిర్వహించారు. పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.