గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
NGKL: గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగాల మండలంలోని అంబటిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఆయన పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి ప్రజలందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.