VIEDO: అంగన్వాడీ సిబ్బంది నిరసనలు
కోనసీమ: విజయవాడలో నిరసన తెలియజేయడానికి వెళ్లిన అంగనవాడీ సిబ్బందిని అరెస్ట్ చేయడంపై అయినవిల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు, మినీ వర్కర్లు మంగళవారం నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ డిమాండ్ల సాధన కోసం విజయవాడ వెళ్ళిన వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.