పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ లోని మోర్తాడ్ బాలుర ఉన్నత పాఠశాల 2010-11 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. 15 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు లావణ్య, షైక్ అహ్మద్, సురేష్, సవీన్, స్వామిలను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.