VIDEO: ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
కోనసీమ: మామిడికుదురు గ్రామ దేవత నూకాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పురాతన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిన్నారులు ఆధ్యాత్మిక గీతాలకు తమదైన శైలిలో గజ్జెలు కట్టి నృత్యం చేశారు.