క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన NRI

క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన NRI

JN: స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణికి రూ.1.50 లక్షల ఆర్ధిక సహాయంను NRI అసోసియేషన్ సభ్యులు ఆదివారం సాయంత్రం అందజేశారు. ఆసియా గేమ్స్ పేరా టైక్వాండో పోటీలకు ఎంపికైన కృష్ణవేణికి చేయూత అందించారు. అధ్యక్షులు గడ్డం రాజు మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న క్రీడాకారులు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గుర్తింపు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.