ఆలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు

ఆలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు

E.G: గోకవరం మండలంలో పలు ఆలయాలలో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. కొత్తపల్లి గ్రామంలోని రాజలింగేశ్వర స్వామి ఆలయ హుండీ, గోకవరం గ్రామ శివారులో గంగాలమ్మ గుడిలో చోరీలకు పాల్పడిన పేరా నరసింహారావు, గుండి సతీష్‌లను అరెస్టు చేసి 4 బైకులను, కొంత నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు.