పొంగుతున్న వాగులను పరిశీలించిన అధికారి

పొంగుతున్న వాగులను పరిశీలించిన అధికారి

SRD: అందోల్ మండలంలో పొంగిపొర్లుతున్న వాగులను ఆదివారం డిప్యూటీ తహసీల్దార్ సాగర్ మధుకర్ రెడ్డి పర్యవేక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని 52 చెరువులు పూర్తిగా నిండాయి. దీంతో చెరువు ఆయకట్టు ప్రాంతాలను తహసీల్దార్ పర్యవేక్షించారు. ప్రమాదంలో ఉన్న చెరువు కట్టలను, అదేవిధంగా పంటల నష్టం వివరాలను కూడా సేకరించి ఉన్నతాధికారుల నివేదిస్తామని ఆయన చెప్పారు.