లోతట్టు ప్రాంతాలలో సందర్శించిన సీఐ
VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు, ఎస్సై జోగారావు ముందుగా గుర్తించిన ఐదు లోతట్టు ప్రాంతాలను మంగళవారం సందర్శించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నచోట సిబ్బందిని నియమించి పలు సూచనలు చేశారు. గెడ్డ ప్రాంతాలలో వాహనాలు రాకుండా ముందుస్తు చర్యలలో భాగంగా స్టాపర్లను ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.