కుష్టువ్యాధి పై అవగాహన తప్పనిసరి

విజయనగరం: కుష్టు వ్యాధి పై అవగాహన కలిగి ఉండాలని చెల్లూరు లెప్రసీ మిషన్, హీల్ ప్రాజెక్ట్ ప్రతినిధి డాక్టర్ తాలాడ దీప్తి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుష్టువ్యాధి ఇంటింటి సర్వే ముగింపు కార్యక్రమంలో భాగంగా చెల్లూరులోని ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థులకు కుష్టు వ్యాధి పై అవగాహన కల్పించారు. హెఎం రాము, సీడిఓ వంశీ పాల్గొన్నారు.