RCB vs CSK: చెన్నై ఖాతా తెరుస్తుందా..?

RCB vs CSK: చెన్నై ఖాతా తెరుస్తుందా..?

IPL 2026లో తొలి రెండు మ్యాచుల్లో CSK ఓటమిపాలైంది. దీంతో మూడో మ్యాచ్‌లో అయినా ఖాతా తెరవాలని చూస్తోంది. ఈ సీజన్‌ను ఘనవిజయంతో ఆరంభించిన RCBతో ఈరోజు రాత్రి తలపడనుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన CSK, రెండో మ్యాచ్‌లో పేలవ బౌలింగ్ కారణంగా ఓటమి పాలైంది. రుతురాజ్, సంజూ మూడో మ్యాచ్‌లో అయినా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.