భీమవరంలో కల్యాణ మండపం ప్రారంభించిన కేంద్ర మంత్రి
W.G: భీమవరం మండలం చినఅమిరంలో శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు పాల్గొన్నారు.