ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ELR: జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం చిన్న వాగు వంతెన సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అప్పలరాజు గూడెం నుంచి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి వెళుతున్న దంపతుల బైకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త సింహాచలంకు గాయాలు కాగా భార్య కృష్ణకుమారి లారీ వెనుక టైర్ కింద పడి కొంతమేర లారీ ఈడ్చుకుపోవడంతో మృతి చెందింది.