సమగ్ర విచారణకు ఎస్పీ ఆదేశం

ATP: శింగనమల మండల పరిధిలోని నాగులగుడ్డం తండాకు చెందిన రామకృష్ణ (38) మృతి సంచలనంగా మారింది. పోలీసులు కొట్టడంతోనే ఆయన మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తుండటంతో ఎస్పీ జగదీశ్ స్పందించారు. రామకృష్ణ మృతిపై విచారణకు ఆదేశించారు. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.