సీసీ రోడ్ల కోసం ఆందోళన

సీసీ రోడ్ల కోసం ఆందోళన

మేడ్చల్: దుండిగల్ పురపాలిక కార్యాలయం వద్ద బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీవాసులు సీసీ రోడ్ల కోసం ఆందోళన నిర్వహించారు. కార్యాలయం ఆవరణంలో బైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పురపాలిక పరిధిలో 40 అభివృద్ధి పనులకు రెండు రోజుల కిందట టెండర్లు రిలీజ్ చేశారని.. అందులో తమ కాలనీకి ఒక్కటి కూడా దక్కలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.