పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
VZM: పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని గజపతినగరం ఐసీడీఎస్ ఇంఛార్జ్ సీడీపీవో శకుంతుల అన్నారు. బుధవారం గజపతినగరం మండలంలోని మరుపల్లి కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కిషోర్ బాలికలకు అవగాహన సదస్సు జరిగింది. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు ఆరోగ్యానికి హానికరం అన్నారు.