'మట్కా, గ్యాంబ్లింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలి'
KDP: జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో మట్కా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సబ్ డివిజన్ లోని సీఐలతో, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. తీవ్రమైన కేసుల గురించి ఆరా తీశారు.