రికార్డు స్థాయికి బిట్‌కాయిన్ విలువ

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ రికార్డు స్థాయికి చేరింది. తొలిసారి దీని విలువ 1,11,000 డాలర్లను తాకింది. సంస్థాగత మదుపర్ల నుంచి గిరాకీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధాన నిర్ణయాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. బిట్‌కాయిన్ విలువ 3.3శాతం పెరిగి 1,11,878 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరినట్లు తెలిపారు. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఈథర్ విలువ కూడా 7.3శాతం పెరిగింది.