రేపు పిఠాపురంలో PGRS
KKD: పిఠాపురం PADA కార్యాలయంలో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. కార్యాలయానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.