జోర్డాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జోర్డాన్, ఇథియోపియో, ఒమన్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జోర్డాన్ పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు హిజ్ మజెస్టీ కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్.. మోదీకి ఘనస్వాగతం పలికారు. మిత్ర దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం.