మనమిత్ర వాట్సాప్ సేవలపై అవగాహన

PPM: కొమరాడ MPDO ఎస్.రమేష్ శనివారం కొమరాడ, గుమడ గ్రామ సచివాలయాలలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను తమ ఫోన్ నుంచే ఎవరికి వారే తమ ఇంటి వద్దనే పొందవచ్చునని తెలిపారు. ఈ విధానం ద్వారా 709 సర్వీసులు పొందవచ్చునన్నారు.