శుక్రమౌఢ్యంతో పంచాయతీ ఆశావహుల్లో ఆందోళన
WGL: నేటి నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్రమౌఢ్యం ప్రారంభం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఆశావహులు టెన్షన్‌కు లోనయ్యారు. మౌఢ్యంలో నామినేషన్ వేస్తే ఫలితం దెబ్బతింటుందనే భయం వెంటాడుతోంది. కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు ముగిసిన అనంతరం షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు పండితుల వద్దకు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తుంది.