'మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి'
AKP: మున్సిపల్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు చెల్లించాలని గత ప్రభుత్వం సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని 12వ పీఅర్సీ ప్రకటించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నర్సింహా మూర్తి, రవి అజయ్ పాల్గొన్నారు.