జట్టులోకి రావడం అంత తేలిక కాదు: రిషభ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం అంత తేలిక కాదన్నాడు. అయితే, తన విషయంలో భగవంతుడి దయతోనే ఇది సాధ్యమైందని వెల్లడించాడు. మనం సరైన అంశంపై దృష్టి పెడితే అనవసర విషయాలు మనల్ని కదిలించలేవని చెప్పాడు. మన కంఫర్ట్‌జోన్‌లో ఉంటూ.. తీవ్రంగా శ్రమించాలని పంత్ పేర్కొన్నాడు.