భూ నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ
NLG: చింతపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మెల్యే బాలునాయక్ వర్కాల రైతులకు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేశారు. సర్వే నంబర్ 73 పరిధిలో భూములు కోల్పోయిన 15 మంది బాధితులకు మొత్తం రూ.3.04 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతతో ఉందని, ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.