నేడు BHPL జిల్లాలో సీఎం పర్యటన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా CM హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:00 గంటలకు కాలేశ్వరం ఆలయానికి చేరుకుని 3:05 నుంచి 3:25 గంటల మధ్య స్వామి దర్శనం చేసుకుని భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం మ. 3:30 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. సా.6:30 నుంచి 7:45 గంటల వరకు రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేస్తారు.