VIDEO: టీకాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మంత్రి
BHPL: మంగళవారం రేగొండ మండల కేంద్రంలో జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని మాట్లాడుతూ.. పశువులకు సకాలంలో టీకాలు వేయించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని, గాలికుంటు వంటి వ్యాధులు, పాల ఉత్పత్తిపై అనుకూల ప్రభావం చూపుతాయని గుర్తుచేశారు. MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.