నేడు మండల సర్వసభ్య సమావేశం
KDP: పెండ్లిమర్రిలోని స్థానిక MPDO కార్యాలయంలోని సభా భవనంలో ఇవాళ ఉదయం 10 గంటలకు MPP వరలక్షుమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల హాజరుకావాలని MPDO కోరారు.