'ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి'
MNCL: జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికి వదిలి హైదరాబాద్‌లోనే ఉంటున్నారని BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. బుధవారం తాండూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.