దొడ్డిమేకలలో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం

దొడ్డిమేకలలో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం

KRNL: పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకల గ్రామంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. గ్రామంలోని రహదారుల వెంబడి డ్రైనేజీల పూడిక తీత పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించారు.