అల్లూరి జిల్లాలో దట్టమైన పొగమంచు

అల్లూరి జిల్లాలో దట్టమైన పొగమంచు

ASR: జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో పలు ప్రాంతవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. పాడేరులో 16.3°C, డుంబ్రిగూడలో 15.2°C, అనంతగిరి 14.6°C, అరకులోయ 15.8°C, కొయ్యూరులో 18.6°C, జి.మాడుగుల 13.4°Cగా కనిష్ఠంగా నమోదయ్యాయి. ఉదయం వేళల్లో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.