ఆసక్తిగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్
శివాజీ, లయ ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఓ డైలాగులో మొదలైన ట్రైలర్.. మీ ఒరిజినాలిటీ నాకు మాత్రమే తెలుసంటూ అలీ చెప్పే డైలాగుతో ఆసక్తిగా ముగిసింది.