BREAKING: కారు బీభత్సం.. ముగ్గురు మృతి
AP: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కిర్లంపూడి మం. సోమవరం వద్ద హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్టాప్‌లో వేచి ఉన్న విద్యార్థులపైకి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా కారు ఫ్రంట్ టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.