కమండలం పేరుతో రైతు అకౌంట్‌లో రూ.3 కోట్లు స్వాహా

కృష్ణా జిల్లాలో ఒక రైతును మహిమ గల కమండలం పేరుతో మోసం చేసిన సంఘటన వెలుగుచూసింది. విజయవాడకు చెందిన కొర్లగుంట లక్ష్మీప్రసాద్, 2019లో పోరంకి రైతును పరిచయం చేసుకుని, సింహాచలం సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన కమండలం ఉందని, దానిని అమ్మించి రూ.10 కోట్ల కమీషన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో రైతు నుంచి 2019-2025 వరకు యూపీఐ ద్వారా విడతల వారీగా రూ.3 కోట్లు స్వాహా చేశాడు.