'నర్సారెడ్డికి షోకాజ్ నోటీసులు'

SDPT: గజ్వేల్ మాజీ MLA తూంకుంట నర్సారెడ్డికి TPCC క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఆదివారం గాంధీభవన్లో సమావేశమైన కమిటీ DCC SC సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది. తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని నర్సారెడ్డి అన్నారు.