'రోడ్డు ప్రమాదాల్లో 226 మంది చనిపోయారు’
బాపట్ల: గత సంవత్సరంలో జిల్లాలో జరిగిన 500కి పైగా ప్రమాదాలలో సుమారు 226 మంది చనిపోయారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి ప్రసన్న కుమారి చెప్పారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్లలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ గ్రౌండ్‌లో వాహన దారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాల భారీ నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.