ప్రకాశం జిల్లా ప్రజలకు.. ఎస్పీ కీలక సూచన

ప్రకాశం జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ మంగళవారం కీలక సూచన చేశారు. ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావులేకుండా ప్రజలు పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.