నూజివీడులో భారీ సేవా కార్యక్రమాలు
ELR: శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా భారీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు ఉయ్యాలలు, బట్టలు, బేబీ కిట్లు, బాలింతలకు చీరలు అందజేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ. 5,000 విలువైన వస్తువులను మంత్రి స్వంత ఖర్చుతో అందించారు.