రోడ్లు వేయాలని గిరిజనుల వినూత్న నిరసన
విశాఖ: రోడ్లు నిర్మించాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని, డోలీ మోతతో ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో వెంటనే రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా గిరిజనులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.