పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం?

పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తొలి విడతలో 65.9%, రెండో విడతలో 67% ఓటింగ్ నమోదు కాగా.. ఓవరాల్‌గా రెండు విడతల్లో కలిపి దాదాపు 66.5 శాతం ఓటింగ్ జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలతో(57%) పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. దీంతో పెరిగిన పోలింగ్ ఏ పార్టీకి అనుకూలంగా మారనుందని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.