స్థానికుల చేతిలో కొండచిలువ హతం

స్థానికుల చేతిలో కొండచిలువ హతం

NRML: స్థానికుల చేతిలో కొండ చిలువ హతమైన సంఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోహన్ పాటిల్ పంటచేనులో 12 అడుగుల కొండ చిలువ కనిపించడంతో అటుగా వెళ్తున్న కొందరు రైతులు దానిని హతమార్చారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.