అర్బన్ హెల్త్ సెంటర్‌లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
NRPT: నారాయణపేట పట్టణంలోని అర్బన్ హెల్త్ కేంద్రంలో గురువారం హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ మంజుల జీ.ఆర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారని జిల్లా వైద్య శాఖ అధికారి జయ చంద్రమోహన్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే 15 మందికి వ్యాక్సినేషన్ చేశారు. పవిత్ర హజ్ యాత్రను విజయవంతం కావాలని కోరారు.