VIDEO: పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్
MBNR: నవాబ్‌పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుష్బూ గుప్తా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఫ్యాన్లు తక్కువగా ఉండటాన్ని గమనించిన ఆమె, వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.