పోషణ్ పక్షోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

పోషణ్ పక్షోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

TPT: చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా జిల్లాలో పోషణ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో 8వ పోషణ్ పక్షోత్సవాలు (ఏప్రిల్ 9–23) పోస్టర్లు, అంగన్‌వాడీ కేంద్రాల కోసం రూపొందించిన ECCE మెటీరియల్‌ను ఆవిష్కరించారు. చిన్నారుల సమగ్ర వికాసానికి పోషణ, విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.