కార్తిక వనభోజనంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: కావలిలోని ఏటూరి మండపంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరై, వేడుకలను ప్రారంభించారు. ఆయన రామిరెడ్డి తోటలోని శివాలయాన్ని సందర్శించి, ఆలయ అర్చకుల ఆశీర్వాదం పొందారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.