నేడు ఐవోబీ బ్యాంక్ సేవలకు అంతరాయం

నేడు ఐవోబీ బ్యాంక్ సేవలకు అంతరాయం

NGKL: వంగూరు మండల పరిధిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) సేవలకు ఇవాళ అంతరాయం కలుగుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. సిస్టమ్ అప్‌గ్రేడ్, సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలు ఆదివారం నుంచి తిరిగి పునరుద్ధరించబడతాయన్నారు. నాణ్యమైన సేవలు అందించేందుకే ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు.