'5న ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వాహనాల వేలంపాట'

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం కేసులలో పట్టుబడిన మోటార్ సైకిళ్లను వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నాగ సునీత రాణి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 3 మోటార్ సైకిళ్లను ఈనెల 5వ తేదీన వాహనాల వేలం వేస్తున్నామన్నారు. ఆసక్తిగల వారు డిపాజిట్ కట్టి వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.