అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

SDPT: అప్పుల భారంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నె భాస్కర్ అనే యువ రైతు సాగు పెట్టుబడికి చేసిన అప్పు తీర్చలేక, మనస్తాపం చెంది గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.